తెలంగాణ ప్రేమజంట ఆంధ్రలో అనుమానాస్పద మృతి

First Published 1, Dec 2017, 6:13 PM IST
teenage lovers commit suicide west godavari district in Andhra
Highlights
  • పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రేమజంట అనుమానాస్పద మృతి
  • సల్గొండ యువతి, ఖమ్మం యువకుడిగా గుర్తించిన పోలీసులు 

 

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తెలంగాణకు చెందిన ఓ  ఫ్రేమజంట కొయ్యగూడెం శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఇవాళ చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన లావణ్య, ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు కొయ్యలగూడెం దగ్గర చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రేమజంట ఇక్కడి వరకు మోటార్ సైకిల్ పై వచ్చి ఇక్కడ ఉరేసుకుని చనిపోయి వుంటారని పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి సమీపంలోనే పోలీసులు టీఎస్‌ 05 ఈజే 6255 నెంబర్ గల మోటార్ సైకిల్ గుర్తించారు. అయితే వీరు ఖమ్మం నుంచి సత్తుపల్లి మీదుగా కొయ్యలగూడెం కు చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అసలు వీరు కొయ్యగూడెం ఎందుకు వచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా వీరిని హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader