విశాఖలో ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ స్కూల్ ఏర్పాటు

tech mahindra to set up internet of things school in vizag
Highlights

  • టెక్ మహింద్ర రవిచంద్రన్ వెల్లడి
  • ఎపి ఐటి మంత్రి నారా లోకేశ్ తో సమావేశం

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) స్కూల్ ను త్వరలో విశాఖపట్నం లో ఏర్పాటు చెయ్యబోతున్నామని టెక్ మహేంద్ర ప్రెసిడెంట్ అండ్ సిఓఓ రవిచంద్రన్ వెల్లడించారు. ఈరోజు బెంగుళూరులో రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేష్ ఆయనను కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 లోపు లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సహకారం కావాలని ఆయన రవిచంద్రన్ ను కోరారు. విశాఖపట్నం లో ఉన్న టెక్ మహేంద్ర సెంటర్ లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని కోరారు. దీనికి స్పందిస్తూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో వస్తున్న నూతన వరవడుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజిస్ ఏర్పాటు చేస్తామని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) స్కూల్ ను త్వరలో విశాఖపట్నం లో ఏర్పాటు చెయ్యబోతున్నామని రవిచంద్రన్ తెలిపారు.

నూతన టెక్నాలజీ ల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మా విద్యార్థులను తీర్చిదిద్దడానికి టెక్ మహేంద్ర ఐఐడిటి లో భాగస్వామ్యం కావాలని లోకేష్ చెప్పారు.

విశాఖపట్నం టెక్ మహేంద్ర సెంటర్ లో కార్యకలాపాలను మరింతగా పెంచబోతున్నామని అక్కడ మరిన్ని ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నామని టెక్ మహింద్ర ప్రతినిధులు అని మంత్రి నారా లోకేష్ దృష్టికి తెలిపారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో కలిసి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వారు చెప్పారు. విశాఖపట్నం లో జరిగే అగ్రిటెక్ సమ్మిట్ లో భాగస్వాములయ్యేందుకు టెక్ మహింద్ర బృందం హామీ ఇచ్చింది.

 

loader