Asianet News TeluguAsianet News Telugu

87 పరుగుల దూరంలొో...

  • విజయం దిశగా టీం ఇండియా
team india need 87 more runs to win series

ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పట్టుసాధించింది. టీం ఇండియా ఉచ్చులో పడిపోయిన ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తటపటాయిస్తూ వచ్చింది. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత్ బౌలర్లు చెలరేగారు. కేవలం 137 పరుగులకే ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో చుట్టేశారు.

 

ఉమేశ్‌ యాదవ్‌ (3/29) లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో, రవీంద్ర జడేజా (3/24), అశ్విన్‌ (3/29) స్పిన్‌ మాయాజాలం తోడవడంతో స్వల్ప స్కోరుకే కంగారూల కథ ముగిసింది.

 

ఆ జట్టులో మాక్స్ వెల్ ఒక్కడే 45 పరుగులు చేసి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫస్టు ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కెప్టెన్ స్మిత్ కేవలం 17 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ కోహ్లీ లేకున్నా జట్టులో ఆ లోటు కనిపించకుండా అందరూ కలసికట్టుగా సమన్వయంతో అసీస్ ను కట్టడి చేయడం విశేషం.

 

ఆ తర్వాత 106 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. ఒపనర్లు రాహుల్, మురళి విజయ్ 19 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో 87 పరుగులు చేస్తే భారత్ నిర్ణయాత్మక నాల్గో టెస్టులో విజయం సాధంచి సిరీస్ ను 3-2తో గెలిచే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios