రెండో టెస్టు లో టీం ఇండియా విజయం వెనక అతడి కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
మొదటి టెస్టులో విరాట్ సేనను కంగారు పెట్టించిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో మాత్రం చేతులెత్తేసింది. స్వల్ప లక్షాన్ని కూడా చేధించలేక విజయం ముంగిట తడబడింది.
భారత్ స్పిన్ ధాటికి కుప్పకూలింది. దీంతో రెండు టెస్టులో విరాట్ సేన అనూహ్య విజయం సాధించి రేసులో నిలిచింది.
అయితే ఈ మ్యాచ్ లో భారత విజయానికి మొత్తం క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం అశ్విన్ కే. మొదటి టెస్టులో నిరాశపరిచిన ఆశ్విన్ ఈ రెండో టెస్టులో మాత్రం కంగారులను కంగారెత్తించాడు. ఆరు వికెట్లను తీసి భారత్ విజయంలో కీలక పాత్ర వహించాడు.
ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే ఆలౌట్ చేసి తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది.
188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ మొదటి నుంచే తడబడింది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలానికి వికెట్ల ముందు అడ్డంగా దొరికింది. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాల కూడా తలో చేయి వేయడంతో భారత్ విజయం ఖాయమైంది.
213/4 స్కోరుతో మంగళవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో 61 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ 274 పరుగులు చేసింది.
