తెలుగు దేశం పార్టీ షాక్

అనంతపురం జిల్లా ఉరవకొండ సర్పంచ్ నర్రా సుజాత, ఆమె భర్త నర్రా కేశన్న టిడిపికి రాజీనామా చేశారు. తమపై మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సోదరుల వద్ద కొందరు చేరి తమను పార్టీకి దూరం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేసినట్టు చెప్పారు.
 పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయానికి పంపారు. 20 సంవత్సరాలుగా టీడీపీలో క్రమశిక్షణతో పని చేశామని అయితే, ఇపుడు అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఎన్ఎస్ఎఫ్కు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామన్నారు. తమపై కేసులు బనాయించారని వారు గుర్తు చేశారు.
వాస్తవాలు పయ్యావుల సోదరులకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని నర్రా సుజాత ఆరోపించారు.
ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో కూడ తమను పాల్గొనకుండా అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు.కొందరు వ్యక్తులు తమను పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా పని చేయడం బాధాకరమన్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఏ పార్టీలో చేరేది వారు వెల్లడించలేదు.

‘‘సొంత పార్టీ వారే అభివృద్ధి కి అడ్డు పడుతూ, విజిలెన్స్ ఎంక్వియిరి పేరుతో నిత్యం వేదిస్తుంటే 4 సంవత్సరాల నుండి భరిస్తూ వచ్చాము.ఇక ఓర్పు నశించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.పార్టీ లో వుంటూ ఎవరు అడ్డు పడుతున్నారో చెప్పలేక పోయాము,యీప్పుడు ఆ భయం లేదు ఇక ఎవరు అడ్డుపడిన ప్రజలందరికీ తెలియజేస్తాము.సర్పంచ్ గా,రాఘవేంద్రచారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరికి అందుబాటులో ఉంటూ,పనులు చేస్తామ’’ని ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.