అకస్మాత్తుగా తెలుగుదేశం ప్రభుత్వానికి నంద్యాల మీద ఏనలేని ప్రమే పట్టుకొచ్చింది. ఉప ఎన్నికల పుణ్యమా అని  నంద్యాలకు తిరుపతి, విశాఖల పక్కన సీటెస్తున్నారు. నంద్యాలను స్మార్ట్ సిటిగా మారుస్తామని ఉప ఎన్నికల బాధ్యుడు,మునిసిపల్ మంత్రి పి నారాయణ ఈ రోజు హామీ ఇచ్చారు.

నంద్యాల అసెంబ్లీనియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పని సరి కావడంతో తెలుగుదేశం ప్రభుత్వం లో గుబులు ఎక్కువయిందనిపిస్తున్నది. అందుకే చిత్రమయిన హమీలను ఇవ్వబోతున్నది. మూడేళ్ల తర్వాత ఇపుడు నంద్యాల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో...

ఈ రోజు నంద్యాల నియోజవర్గంలోటిడిపి గెలుపును భజానేసుకున్న మునిసిపల్ మంత్రి ఏమన్నాడో తెలుసా... నంద్యాల పట్టణానికి విశాఖ, తిరుపతిల పక్కన సీటేస్తామన్నారు.

ఇంతవరకు కనీసం చర్చల్లో కూడా నలగని అమాయకపు నంద్యాలను ఇపుడు స్మార్ట్ సిటీగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. 

ఆ విషయం స్మార్ట్ సిటి ప్రతిపాదనలు పంపిస్తున్నపుడు రాలేదా? కొత్త విద్యాసంస్థలను, వైద్య సంస్థలను ప్రకటిస్తున్నపుడు విశాఖ తిరుపతి తప్ప మరొక సిటి గురించి ఆలోచించారా?అపుడు నంద్యాల గుర్తు రాలేదా?

ఈ రోజు కర్నులులో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రి నారాయణ సమీక్ష చేశారు. అక్కడ ఆయన చెప్పిన మాటలు:

* ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 1100 కోట్ల పనులు నియోజకవర్గంలో చేపడుతున్నాం.

* పట్టణంలో అన్ని రోడ్లను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దే పనులు వెంటనే చేపడుతున్నాం.

* దేశంలో ఎక్కడాలేనంత నాణ్యతతో పేదల ఇళ్ళు ఇక్కడ నిర్మిస్తున్నాం

* ఒక్కో ఇంటికి లక్ష చొప్పున మౌలికసదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది .

* ఇలాంటి 13000 ఇళ్ళను నంద్యాలలో పేదల కోసం నిర్మిస్తున్నాం.

ఇదీ సంగతి.