టీడీపీ సీనియర్ నేత దుర్మరణం

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే రావి శోభానాదీశ్వర చౌదరి(95) శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గానికి 1984-89, 1994-99 కాలంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గుడివాడ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా 25సంవత్సరాలు ఏకధాటిగా కొనసాగారు. జిల్లాలో తెదేపా బలోపేతానికి అహర్నిశలూ కృషి చేశారు. ఆయన కుమారుడైన రావి వెంకటేశ్వరరావు ప్రస్తుత తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. పలువురు ప్రముఖులు శోభనాదీశ్వర చౌదరి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.