జగన్ కాళ్లు పట్టుకుంటా.. జలీల్ ఖాన్

First Published 13, Apr 2018, 2:55 PM IST
tdp mla jaleel khan chanlenge to ycp president ys jagan
Highlights
తన పదవికి కూడా రాజీనామా చేస్తానంటున్న జలీల్ ఖాన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. జగన్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తే.. వెంటనే తాను జగన్ కాళ్లు పట్టుకుంటానని చెప్పారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... పరిపాలన చేతగాక దద్దమ్మలా మోదీ దీక్ష చేసారని ఎద్దేవా చేశారు. పార్లమెంటును సజావుగా నడిపించలేని నరేంద్రమోదీ  వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్నారు. దళితులు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నా కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. చంద్రబాబునాయుడు బాధ్యతగల వ్యక్తి కాబట్టి నాలుగేళ్లు ఓపిక పట్టారని, మరి ప్రతిపక్ష నేతగా జగన్ నాలుగేళ్లు ఏమి చేశాడో చెప్పాలన్నారు. అలాగే పాదయాత్రలో జగన్ నోటి వెంట మోదీ దొంగ, బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే నా పదవికి రాజీనామా చేస్తానని జలీల్‌ఖాన్ అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఇన్ కంటాక్స్ కట్టనవసరం లేదు అని చెప్పే జ్ఞానం లేని జగన్ ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? అని ఆయన అన్నారు.

loader