చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్

ఇప్పటికే ఉన్న సమస్యలతో సతమతమౌతున్న చంద్రబాబుకి తాజాగా కొత్త సమస్యలు పుట్టుకువస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. దీంతో జిల్లా సమస్యలు చంద్రబాబుకి తలనొప్పిగా మారిపోయాయి. ఇలాంటి తలనొప్పే.. ఇప్పుడు చంద్రబాబుకి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకరవర్గంలో మొదలైంది.

ఇక అసలు విషయానికి వస్తే.. చీపురుపల్లి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు సమస్య తారాస్థాయికి చేరుకుంది. ఇంతవరకు అంతర్గతంగా ఒకరిపై మరొకరు విమర్శించుకునే స్థాయి నుంచి బాహాటంగా ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఏకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మ రీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేసుకునే స్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం అమరావతిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్వహించిన జిల్లా సమన్వయకమిటీ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ నేత కె.త్రిమూర్తులురాజు(కేటీఆర్‌)పై ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దేబాబూరావు ఫిర్యాదు చేయడంతో వారి మద్య విభేదాలు రోడ్డునపడేలా చేసిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ విషయంలో త్రిమూర్తులు రాజు బాగా సీరియస్ అయ్యారు. తన మీద మంత్రికే ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిమిడి మృణాళిని, గద్దే బాబురావులు తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంలో త్రిమూర్తులురాజు సీఎం చంద్రబాబు పై కూడా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో సమస్యలు తెలసినా.. చంద్రబాబు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos