జగన్ వైపు చూస్తున్న టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే

జగన్ వైపు చూస్తున్న టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి  టిడిపి వదిలపెట్టి వైసిపిలో చేరబోతున్నట్లు సమాచారం. తొందర్లోనే ఆయన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కలసి, ఆయన సమక్షంలోనే పార్టీ లో చేరతాడని ఆయన సహచరులు చెబుతున్నారు.  రవి  యలమంచిలి నాగేశ్వరరావుకుమారుడు. నాగేశ్వర్ రావు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారే. 2009లో రవి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలుపొందారు. అపుడాయన కాంగ్రెస్ ప్రత్యర్థి రాజశేఖర్ ను ఓడించారు. తర్వాత పిఆర్ పి  కాంగ్రెస్ లో విలీనమయినపుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. తర్వాత ఆయన టిడిపిలోకి వెళ్లారు. మొదట్లో ఆయన  చురుకుగానే పార్టీలో పనిచేశారు. తర్వాత మానేశారు. టిడిపిలో పలువురు నాయకులతో ఆయనకు పొసగడంలేదని తెలిసింది. ఇపుడాయన వైసిపిలోచేరాలనుకుంటున్నారు.

 

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page