Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి పెద్దమనిషి బుచ్చయ్య చౌదరికి ఉండవల్లి ధాంక్స్

పట్టి సీమ ప్రాజక్టు పచ్చి మోసం అంటూ దీని మీద చర్చ కు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విసిరిన   సవాల్  టిడిపి సీనియర్ ఎమ్మెల్యే చ్చయ్య చౌదరి స్వీకరించారు. అయితే, ఈ చర్చకు వచ్చేటపుడు గోరంట్ల పోలవరంపై కూడా స్టడీచేసి రావాలని ఉండవల్లి సలహా ఇచ్చారు.  ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు, ఆంధ్రప్రదేశ్ అనుమతితోనే  గోరంట్ల చర్చకు వస్తున్నారని ఉండవల్లి భావిస్తున్నారు.

TDP accepts vundavallis challenges for a debate on controversial pattiseema

తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కాంగ్రెస్ మాజీ రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే, పట్టి సీమ ప్రాజక్టు పచ్చి మోసం అనే ఆయన సవాల్  బుచ్చయ్య చౌదరి స్వీకరించి చర్చకు సై అన్నారు.

 

ఉండవల్లి చాలా కాలంగా పట్టి సీమ  పచ్చి మోసం అనే దాని క్యాంపెయిన చేస్తున్నారు.  ఆయన అర్య్గ్ మెంటు, సెంటిమెంటల్ అర్య్గు మెంటు  కాదు. దీని మీద చాలా పరిశోధన చేశారు. కాగ్ రిపోర్టులు, జివొలు శోధించడమేకాకుండా చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడి సమాచారం సేకరించారు.  అందువల్ల ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేసేందుకు ఆయన చర్చలలో పలు చోట్ల చర్చలు పెట్టారు.  ఆయన లేవనెత్తిన అంశాలకు  ప్రభుత్వం సరైన సమాధానం రాకపోవడంతో బహిరంగ చర్చ కు సిద్ధమా అని టిడిపి వాళ్లను కవ్వించారు. టిడిపి వాళ్లదగ్గిర... పట్టిసీమప్రాజక్టు  గోదావరి నీళ్లు కృష్ణా కొస్తాయి. కృష్ణమ్మ జలాలు రాయలసీమకు పోతాయనే సెంటిమెంట్ తప్ప సరుకు లేదు. వాళ్లదంతా గంగమ్మ  పూజల వ్యవహారం. అందులో పారుతున్న అవినీతి జోలికి తెలుగుదేశం నేతలు వెళ్లరు. ఎందుకంటే, భాగస్వాములంతా పెద్దోళ్లు.  ఇపుడు తెలుగుదేశంలో ఉన్న ఒక  పెద్ద మనిషి , సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే తన  సవాల్‌ను స్వీకరించి చర్చకు అంగీకరించార కృతజ్ఞతలు చెప్పకుండా ఉండవల్లి ఉండలేరు.

 

‘గోరంట్ల చెప్పినట్టు 18వ తేదీన రైతుల సమక్షంలో చర్చకు నేను సిద్ధం,’ అని రాజమండ్రిలో  ప్రకటించారు.

 

అయితే,‘ చర్చ కృష్ణా బ్యారేజి పైనా, లేక కృష్ణా వద్ద అనేది గోరంట్ల పిలుపులో స్పష్టంచేయలేదు. పట్టిసీమ ఒక నిరుపయోగ ప్రాజెక్టు అని నేటికీ నిరూపించగలను. పోలవరం హెడ్ వర్క్సు నిర్మాణానికి రూ.4200 కోట్లు అంచనాఅన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకు సుమారు రూ.3200 కోట్లు ఖర్చతుందనిచెబుతున్నారు.  ఈ మొత్తం ఖర్చుచేస్తే  పోలవరం ప్రాజక్ట్ హెడ్‌వర్క్సు 70 శాతం పూర్తయ్యేవి కదా,’ అని ఆయన ప్రశ్నించారు.

 

పట్టిసీమ ఒక పెద్ద ఫ్రాడ్ అని అంటూ  ఖజానాకు  రూ.391 కోట్లు  నష్టంతెచ్చిందన  కాగ్ తేల్చింది. కృష్ణా రైతులతో పట్టిసీమ గురించి గొప్పగా ప్రచారం చేయించి పోలవరం పక్కనబెట్టేందుకు ఒక కుట్ర జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు.

 

పట్టిసీమ పథకం కేవలం కిక్ బ్యాక్‌ల కోసమేనని అంటూ పట్టిసీమ నదుల అనుసంధానం కాదని నేషనల్ వాటర్ డవలప్‌మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యుడిఎ) తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

 

ఈ చర్చకు వచ్చేటపుడు గోరంట్ల పోలవరంపై కూడా స్టడీచేసి వస్తారని ఆశిస్తున్నానని అంటూ  , ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు, ఆంధ్రప్రదేశ్ అనుమతితోనే  గోరంట్ల చర్చకు వస్తున్నారని ఉండవల్లి భావిస్తున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios