వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ భారీ షాక్

వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ భారీ షాక్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్.. డిస్కౌంట్లను ఎత్తివేయనుందా..? ఇక ముందు ఫ్లిప్ కార్ట్ నుంచి ఎలాంటి డిస్కౌంట్లను ఆశించలేమా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే... వినియోగదారులకు ఇస్తున్న డిస్కౌంట్లను  కంపెనీ వ్యయాల్లోకి చేర్చాలని కోరుతూ, తద్వారా కంపెనీ  ఆదాయనష్టాలను పూడ్చుకోవాలన్న   ఫ్లిప్ కార్ట్ ఇటీవల  ఆదాయపన్ను శాఖని కోరింది. కాగా.. ఫ్లిప్ కార్ట్  అభ్యర్థనను  ఆదాయపన్ను శాఖ తోసి పుచ్చింది. ఇటువంటి వ్యయాలు వ్యాపారాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తున్నవని వాటిని మూలధనం కింద మాత్రమే పరిగణిస్తామని చెప్పింది.

ఫలితంగా ఫ్లిప్ కార్ట్ పై  30శాతం పన్ను భారం పడనుంది. దీంతో ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లు ఇవ్వడం ఆపేస్తుందనే ప్రచారం మొదలైంది. ఇలాంటి అనుభవం అమేజాన్, స్నాప్ డీల్ కంపెనీలకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఫ్లిప్ కార్ట్ ఇతర చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos