లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్)  ఆధ్వర్యంలో మొట్టమొదటి సారి లండన్ వేదికగా "టాక్ టీ20 క్రికెట్ లీగ్" నిర్వహిస్తున్న సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రికెట్ పోటీల  విశేషాలను వివరించారు. 

టాక్  స్పోర్ట్స్ కార్యదర్శి రాకేష్ పటేల్ మాట్లాడుతూ, టాక్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారి లండన్ లో జరుపుతున్న క్రికెట్ పోటీలకు మంచి స్పందన వచ్చిందని, 8 టీంలు ఇందులో పాల్గొంటాయని, మే 13 నుండి ప్రారంభమై ఆగష్టు 5 నాడు ముగుస్తాయని తెలిపారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాల ద్వారా  సమాజంలో  ఒకరికొకరితో  స్నేహభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పారు.

క్రికెట్ టీం ఓనర్స్ కీ - కెప్టెన్ కీ మరియు టీం సభ్యులకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.  అలాగే ఈ పోటీల పోస్టర్ ని ఆవిష్కరించి ప్రోత్సహించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ. అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

టాక్  స్పాన్సర్ - కార్యదర్శి రవి రేతినేని మాట్లాడుతూ, టాక్ తల పెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్థానిక ప్రవాస కుటుంబ సభ్యులు , ఈ క్రికెట్ పోటీలకు కూడా  హాజరై క్రీడాకారులని, నిర్వాహకులని ప్రోత్సహించాలని కోరారు.  

చివరిగా బిజినెస్ కార్యదర్శి వంశీ వందనపు మాట్లాడుతూ, ఈ క్రికెట్ పోటీలకు సహకరించిన స్పాన్సర్స్ కీ,  మీడియా కీ, ప్రవాస సంస్థలకి ముఖ్యంగా టాక్ కార్యవర్గ సభ్యులకి కృతఙ్ఞతలు తెలిపి, అందరం కలిసి విజయవంతం చెయ్యాలని కోరారు.