ప్రముఖ ఆటో మొబైల్స్ సంస్థ టాటా మోటార్స్.. భారత మార్కెట్లోకి మరో కొత్త కారుని ప్రవేశపెట్టింది. ‘ జస్ట్ ప్రీమియో’ పేరిట ఈ కారును విడుదల చేసింది. దీని ధర రూ.7.53లక్షలు( ఎక్స్ షోరూం,ఢిల్లీ)గా ప్రకటించింది.  దేశంలోని అన్ని టాటామోటార్స్ విక్రయ కేంద్రాల్లో ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. జెస్ట్ మోడల్ సిరిస్ లోనే దీనిని కూడా విడుదల చేసింది.

ఈ ‘జెస్ట్‌ ప్రీమియో’ కారులో 1.3 లీటర్ల డీజిన్‌ ఇంజిన్‌తో పాటు 13 అత్యాధునిక ఫీచర్లున్నాయి. 2014 ఆగస్టులో తొలిసారిగా జెస్ట్‌ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది టాటామోటార్స్‌. అప్పటి నుంచి 85వేల యూనిట్లకు పైగా ఈ మోడల్‌ కార్లను విక్రయించింది. ఈ మోడల్ లోనే అదనపు హంగులతో ఇప్పుడు దీనిని తీసుకువచ్చింది. గత మోడల్స్ మాదిరిగానే.. ఈ జస్ట్ ప్రీమియో కూడా యువతను ఆకట్టుకుంటుదని భావిస్తున్నట్లు టాటామోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ బిజినెస్‌ యూనిట్‌  ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరేఖ్‌ అన్నారు.