వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ ప్యాసింజర్‌ వాహనాలపై రూ. 25వేల వరకు ధర పెంచుతున్నట్లు కంపెనీ సోమవారం  ప్రకటించింది. తయారీ ఖర్చు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ టాటా మోటార్స్‌ తమ ప్యాసింజర్‌ వాహనాల ధరలు పెంచుతోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ ప్యాసింజర్‌ వాహనాలపై రూ. 25వేల వరకు ధర పెంచుతున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. తయారీ ఖర్చు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

.‘మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, పెరుగుతున్న తయారీ ఖర్చులు, ఇతరత్రా ఆర్థిక కారణాల వల్ల మేం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం’ అని టాటామోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరేఖ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

2018 జనవరి నుంచి పలు మోడళ్లపై రూ. 25వేల వరకు ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా.. టాటామోటార్స్‌తో పాటు మరిన్ని ఆటోమొబైల్‌ సంస్థలు కూడా వచ్చే ఏడాది ధరల పెంపునకే మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే టొయోటా కిర్లోస్కార్‌ మోటార్‌, హోండా కార్స్‌ ఇండియా, స్కోడా, ఇసుజు లాంటివి జనవరి నుంచి తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.