ట్యాప్ టూ అన్ బ్లాక్ అంటున్న వాట్సాప్

First Published 11, Dec 2017, 5:44 PM IST
Tap to Unblock Reply Privately in Groups Soon on WhatsApp
Highlights
  • త్వరలో మరో కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.
  • ఈ విషయాన్ని వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో కొత్త ఫీచర్స్ ని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పలు ఫీచర్లు అందుబాటులో ఉండగా.. ఇటీవలే ‘‘ డిలీట్ ఫర్ ఎవ్రీవన్’’ అనే సదుపాయన్ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలో మరో కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం...

ట్యాప్ టూ అన్ బ్లాక్

వాట్సాప్‌ ఎవరినైనా బ్లాక్‌ చేయాలంటే సెట్టింగ్స్‌ లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లాక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్‌ను అన్‌బ్లాక్‌ చేయాలంటే.. మళ్లీ సెట్టింగ్స్‌ లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌ ఆప్షన్‌తో కేవలం నెంబర్‌పై లాంగ్ ప్రెస్‌ చేస్తే అన్‌బ్లాక్‌ అవుతుంది.

షేక్ టూ రిపోర్ట్

వాట్సాప్‌లో ఏవన్నా సాంకేతిక సమస్యలు ఉంటే ఒక్కోసారి మెసేజ్‌లు వెళ్లవు, రావు. వాటి గురించి మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి తెలియజేయాలంటే.. జస్ట్‌ మన ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. కాంటాక్ట్‌ లిస్ట్‌ ఓపెన్‌ అయ్యి ఓ ఆప్షన్‌ వస్తుంది. అందులో సమస్యేంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్‌ చేస్తే చాలు.

ప్రైవేట్ రిప్లైస్

వాట్సాప్‌లో మనం గ్రూప్‌ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్‌ చేసినా అది అందరికీ వెళుతుంది. ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపాలంటే వేరుగా కాంటాక్ట్‌ ఓపెన్‌ చేసిమెసేజ్‌ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్‌ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్‌ పంపొచ్చు. మెసేజ్‌ టైప్‌ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్‌ రిప్లై ఆప్షన్‌ నొక్కితే చాలు.

ఈ కొత్త ఫీచర్లన్నీ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. అయితే వాట్సాప్‌ వెబ్‌ 2.7315 వెర్షన్‌లో కేవలం ప్రైవేట్‌ రిప్లైస్‌, పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ ఆప్షన్లు మాత్రమే అప్‌గ్రేడ్‌ అవుతాయి. 2.17.424, 2.17.436, 2.17.437 వెర్షన్లలో ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, న్యూ ఇన్‌వైట్‌ వయా లింక్‌, షేక్‌ టు రిపోర్ట్‌ ఆప్షన్లు ఆప్‌గ్రేడ్‌ అవుతాయి.

loader