మద్యం తాగి డీజీపీ కూతురు వీరంగం!(వీడియో)

First Published 3, Apr 2018, 1:10 PM IST
tamil nadu adgp tamilselvan daughter was caught on camera
Highlights
మద్యం తాగి డీజీపీ కూతురు వీరంగం!(వీడియో)

తమిళనాడు అడిషనల్ డిజిపి తమిళ్ సెల్వన్ కూతురు అల్లుడు డ్యూటిలో ఉన్న కాన్ స్టేబుల్ తో గొడవ పడటం వీడియో కు చిక్కింది. గొడవకుకారణం వారిని కారును సోదాచేయాలని కాన్ స్టేబుల్ పట్టుబట్టడమే. కారు నీలంకారై బీచ్ వద్ద ఆగిఉన్నపుడు ఈ గొడవ జరిగింది. కాన్ స్టేబుల్ మొదట కారును చూసినపుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి (అల్లుడు) పక్కన కప్ హోల్డర్ లో బీర్ సీసా ఉండింది. పోలీసు దీనిని గురించి ప్రశ్నించగానే, పక్కనున్న మహిళను చూపి, ఆమె ఎవరో తెలుసుగదా, డిజిపి కూతురు అని దబాయించడం మొదలుపెట్టాడు.  అంతేకాదు, కారును వీడియో తీయకుండా అడ్డుకున్నారు. మాజోలికి వస్తే కష్టాల్లో పడతావని, ఉద్యోగం పోతుందని  కూడా హెచ్చరించారు. ఇదీ వైరలయిన వీడియో.

loader