Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయా?

అది సాధ్యంకాదు, కేవలం సిక్కిం అసెంబ్లీ సీట్లను 32 నుంచి 40కి పెంచే ప్రతిపాదన మాత్రమే కేంద్రం దగ్గిర ఉందని అధికార వర్గాల భోగట్టా.

talk of the town the proposal to increase ap assembly seats is with PMO

అంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసెంబ్లీ సీట్లు పెరుగనున్నాయా? ఈ చర్చ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ ప్రధాని కార్యాలయానికి చేరుకుందని కూడా టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ పైలులో సీట్ల సంఖ్య పెంచె ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ 175 నుండి 225 కు, తెలంగాణా 115 నుండి 150, చత్తీస్ గడ్ 90 నుండి 135 సిక్కిం 32 నుండి 40 ,జార్ఖాండ్ 81 నుండి 125, నాగాలాండ్ 60 నుండి 90 పెరుగుతాయి. అయితే, ఇందులో ఎంత వాస్తవముందో తెలియడం లేదు.

అయితే, ఒక సీనియర్ అధికారి ఇందులో వాస్తవం లేదని ‘ఏషియానెట్ ’ కు చెప్పారు. సిక్కిమ్ అసెంబ్లీ సీట్లను పెంచే ప్రతిపాదన కేంద్రం దగ్గిర ఉందని,  ఆ ప్రాసెస్ అరునెలల కిందటే మొదలయిందని, జరిగితే  ఒక్క సిక్కిం సీట్లనే పెంచుతారని ఆయన చెప్పారు. దీనికి కారణ అయన ఇలా వివరించారు.

‘సిక్కిం లో కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయి. 1975 లో సిక్కిం భారత్ విలీనమయినప్పటినుంచి అక్కడ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగలేదు. రిజర్వుడ్ సీట్ల సంఖ్య మరొక 5 స్థానాలుపెరగాల్సిన అవసరం ఉంది.  2016లో దీని మీద సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువడింది. తీర్పునను సరించి సిక్కిం అసెంబ్లీ స్థానాల సంఖ్యను 40 పెంచేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.  ఈ మేరకే జూన్ లో కేంద్ర హోం శాఖ ఒక నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం, లింబూ, తమంగ్ కులాలకు 5 స్థానాలు,భూటియా-లెప్చాలకు 12, ఎస్ సిలకు 2,సంఘాకు 1, జనరల్ 20 సీట్లు ఉంటాయి. దీని మీద కేంద్రం అభ్యంతరాలను కూడా కోరింది. 1973లో భారత ప్రభుత్వానికి, సిక్కిం రాజుకు కుదిరిన ఒప్పందం ప్రకారం భూటియా, లెప్చాలకు సీట్లు కేటాయించాలి. అదింత వరకు అమలు కాలేదు. దీనిమీదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి సీట్లు ను ఈ వర్గాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీని మేరకు  రెప్రెంజెంటేషన్ ఆప్ పీపుల్స్ యాక్ట లో సెక్షన్ 5 A కి ఇపుడు సవరణ చేయాలనుకుంటున్నారు. ఇదే  హోం శాఖ పరిశీలనలో ఉంది. అందువల్ల ఇతర రాష్ట్రాల సీట్లను సిక్కిం కోవలో పెంచేందుకు అవకాశం తక్కువ,’’ అని ఆయన చెప్పారు.

సిక్కిం వ్యవహారం డిసెంబర్ 15 నుండి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో  వచ్చే అవకాశం ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios