సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు రాజేష్ అరెస్ట్

swathi lover rajesh arrest
Highlights

  • స్వాతి ప్రియుడు రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నాగర్ కర్నూల్ కి తరలింపు
  • సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ1 గా వున్న రాజేష్

నాగర్ కర్నూల్ లో సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా వున్న రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ అక్రమ సంభందానికి అడ్డుగా ఉన్నాడని సుధాకర్ రెడ్డి భార్య స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ లు కలిసి అతడిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భార్య స్వాతిని ఏ2  నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

 

నాగర్ కర్నూల్ కు చెందిన సుధాకర్ రెడ్డి, స్వాతిలది ప్రేమ వివాహం. అయితే పెళ్లి తర్వాత భర్త తనను పట్టించుకోవడం లేదని స్వాతి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజేష్ తో అక్రమ సంభందం పెట్టకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో వారు అతడ్ని హతమార్చాలని పథకం పన్నారు. దీంట్లో భాగంగా అతడు పడుకుని ఉన్నపుడు తలపై రాడ్ తో బాది హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భర్త ప్లేస్ లోకి ప్రియుడిని తీసుకురావాలని యాసిడ్ దాడి నాటకమాడి పట్టుబడ్డారు.

 అయితే ఈ కేసులో స్వాతితో కలిసి ప్లాన్ చేసి, సుధాకర్ ను హత్య చేసిన రాజేష్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు.  గత నాలుగు రోజులుగా రాజేష్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.సంచలన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న రాజేష్ ను అరెస్ట్ చేసి విచారించడం ద్వారా మరిన్ని కీలక విషయాలు రాబట్టవచ్చని పోలీసులు భావించారు. అయితే కాలిన గాయాలు మానాయని, ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నామని అపోలో వైద్యులు ప్రకటించగానే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి నాగర్ కర్నూలుకు తీసుకెళ్లారు. ఆతడిని విచారించి ఈ కేసులోని మరిన్ని చిక్కుముళ్లను విప్పనున్నట్లు పోలీసులు తెలిపారు.


  

 

loader