అనూష్క, కోహ్లీ పెళ్లీ మీద అంతా సస్పెన్సే

suspense continues over marriage venue of Anushka and Kohli
Highlights

నిన్న ముంబయిర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించినా, థ్యాంక్స్ అంటూ తుర్రు మని పారిపోయింది

 

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల వివాహం ఎక్కడ? 
ఇటలీలోనా, స్విజర్లాండ్ లోనా... సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఈ నెలలోనే ఇటలీలో  వారిద్దరి పెళ్లి జరగబోతోందని గత నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి. 
ఇది నిజమా లేక వెన్యూ మారిపోతుందా...
ఈ సస్పెన్స్ మధ్య అనుష్క శర్మ గురువారం రాత్రి ముంబయి ఎయిర్‌పోర్ట్‌ లో  మీడియా కంటపడింది.
ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
 పెళ్లి కోసం ఇటలీ వెళుతున్నారా? అంటూ విలేకరులు ప్రశ్నలు కురిపించారు.
అనుష్క మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా థ్యాంక్యూ అని చెప్పి వెళ్లిపోయింది.  
పెళ్లి గురించి వివరాలను అనుష్క తల్లిదండ్రులు వెల్లడించలేదు.
అయితే, ఇరు కుటుంబాల నుంచి స్నేహితులు, సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు వెళుతున్నట్లు తెలుస్తోంది. 
మొదట ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వెలువడ్డాయి.  తర్వాత స్విట్జర్లాండ్‌లో చేసుకోబోతున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి. 
అయితే, అబ్బే ఇప్పుడిప్పుడే పెళ్లి జరగదని అనుష్క ప్రతినిధి ఒకరు ప్రకటించి ఇంకా కన్ ఫ్యూజ్ చేశారు. 
అయినా వీరిద్దరి వివాహ విషయమై చర్చలకు తెరపడటంలేదు. పెళ్లి మీద  ఓ క్లారిటీ వచ్చేలా లేదు.
ప్రస్తుతం విరాట్‌ లంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు.  అనుష్క కూడా షారుక్‌తో ఒక  సినిమా చేస్తున్నారు.

loader