నాసాలో కోచింగ్ తీసుకుంటున్న సుశాంత్ సినిమా కోసం రెండు వారాల పాటు ట్రైనింగ్ చంద్ మామా దూర్కే సినిమా కోసం.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్ లో ధోని జీవిత చ‌రిత్ర‌లో న‌టించిన త‌రువాత బాలీవుడ్ లో టాప్ హీరోగా స్థానం ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని నిలుపుకొవ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.ధోని త‌రువాత వ‌చ్చిన ర‌బ్తా సినిమా ప్లాప్ అవ్వ‌డంతో సుశాంత్ త‌రువాతి సినిమా పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాడు. 

Scroll to load tweet…

సుశాంత్ రెండు సినిమాలు ప్ర‌స్తుతం సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒక‌టి డ్రైవ్‌, మ‌రొక‌టి చంద మామా దూర్కే, చంద మామా దూర్కే సినిమా కోసం సుశాంత్ వ్యోమోగామీగా న‌టిస్తున్నాడు. అందుకు సుశాంత్ బాగా శ్ర‌మిస్తున్నాడు. ఈ సినిమాకు నాసాలో కోచింగ్ తీసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను నిర్మాత వికి ర‌జాని ట్విట్ట‌ర్‌లో పంచుకున్నాడు. ఆయ‌న మ‌రో రెండు వారాల పాటు నాసాలో కోచింగ్ తీసుకుంటారు. త‌రువాత ఈ సినిమా షూటింగ్ లో జ‌యిన్ అవుతారు.

Scroll to load tweet…

ఈ సినిమాను సంజ‌య్ పురాణ్ సింగ్ చౌహాన్ డెరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా 2018 జ‌న‌వ‌రి 26 న విడుద‌ల అవుతుంది.