Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి- జమ్ము హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రేపు మొదలు

ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి ఏసీ బోగీలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ రైలు రాయలసీమ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. తిరుపతి–జమ్ముతావి మధ్య హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడవనున్న ఈ రైలును రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు.

suresh prabhu to flag off Tirupati delhi humsafar express

తెలుగు వాళ్లు దేశ రాజధాని న్యూ ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి ఏసీ బోగీలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి–జమ్ముతావి మధ్య హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడవనున్న ఈ రైలును రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌(22705) ప్రతి మంగళవారం సాయంత్రం 5.10కి తిరుపతి నుంచి బయల్దేరి గురువారం రాత్రి 9.10కి జమ్ముతావి చేరుకుంటుంది.

ఈ రైలు(22706) తిరిగి జమ్ముతావి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 5.30కు బయల్దేరి ఆదివారం ఉదయం 11.20కి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోనీ, మంత్రాలయం రోడ్డు, రాయచూర్‌ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఖాజీపేట, రామగుండం, నాగపూర్, ఢిల్లీ, అంబాలా, లూథియానా, మీదుగా జమ్ముతావి వెళుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios