కోర్కె తీరిస్తేనే ప్రమోషన్: 6 ఏళ్ళుగా ఎయిర్‌హోస్టెస్‌పై లైంగిక వేధింపులు

Suresh Prabhu orders probe after Air   India air hostess alleges sexual   harassment
Highlights

ప్రమోషన్ కావాలా కోరిక తీర్చు

న్యూఢిల్లీ: తన కోర్కెను తీర్చనందుకుగాను పదోన్నతులతో  
పాటు ఇతరత్రా సంస్థ నుండి వచ్చే సౌకర్యాలకు తాను
నోచుకోవడం లేదని ఓ ఎయిర్‌హోస్టెస్ కేంద్ర
విమానాయానశాఖ మంత్రి సురేష్‌ప్రభుకు ట్విట్టర్ వేదికగా
ఫిర్యాదు చేశారు.ఈ విషయమై తాను ఎయిరిండియా
అంతర్గత కమిటీకి కూడ ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా
పోయిందన్నారు. ఈ విషయమై వెంటనే విచారణ
జరిపించాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆదేశాలు జారీ
చేశారు.


ఎయిరిండియాలో  ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న ఓ
మహిళ తన బాధను ట్విట్టర్ వేదికగా కేంద్ర
విమానాయానశాఖమంత్రి  సురేష్‌ప్రభుకు  విన్నవించారు.
ఆరేళ్ళుగా తనను ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లైంగికంగా
వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె చెప్పారు. అతడికి
తాను సహకరించనందుకు గాను పదోన్నతులతో పాటు
ఇతరత్రా ఏ రకమైన సౌకర్యాలను కూడ  ఇవ్వడం లేదని
ఆమె మంత్రికి విన్నవించారు.


తనతో పాటు ఇంకా చాలామందిని సీనియర్ ఎగ్జిక్యూటివ్
తీవ్రంగా వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు
అయితే ఈ విషయమై అంతర్గత కమిటీకి ఈ విషయమై
పిర్యాదు చేసినట్టు చెప్పారు. కానీ తమ ఫిర్యాదుపై ఎలాంటి
చర్యలు తీసుకోలేదన్నారామె.

ఈ విషయమై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు 
విచారణకు
ఆదేశించారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగ విచారణ పూర్తి
చేసి నివేదికను ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

loader