Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వాలకు తలంటిన సుప్రింకోర్టు

వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మరిన్ని మద్యం షాపులకు, బార్లకు అనుమతులు ఇచ్చేందుకు రెండు ప్రభుత్వాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

supreme court take objection on roadside liquor sales

రోడ్ల పక్కనే వెలుస్తున్న మద్యం షాపులు, బార్ల విషయంలో సుప్రింకోర్టు ప్రభుత్వాలకు బాగానే గడ్డి పెట్టింది. ప్రజాహితాన్ని గాలికి వదిలేసి కేవలం ఆదాయాల మీదనే దృష్టి పెట్టకూడదంటూ సుప్రింకోర్టు ప్రభుత్వాలకు గట్టిగా తలంటింది.

 

దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న అన్నీ మద్యం దుకాణాలను, బార్లను మూసేయాలని జారీ చేసిన ఆదేశాలు ప్రభుత్వాలకు మింగుడుపడనిదే.

 

పైకి ప్రజాహితం కోరుతున్నట్లు చెబుతున్నా వీలైనంతలో జాతీయ, రహదారుల వెంబడే మద్యం దుకాణాలను, బార్లను తెరిచేందుకు తెలుగు ప్రభుత్వాలు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నాయి. ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా కేవలం మద్యం మీద వచ్చే ఆదాయాలపైనే ప్రభుత్వాలు దృష్టి నిలపటం గమనార్హం.

 

వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మరిన్ని మద్యం షాపులను, బార్లకు అనుమతులు ఇచ్చేందుక రెండు ప్రభుత్వాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో సుప్రిం ఆదేశాలు ప్రభుత్వాలకు పిడుగుపాటే.

 

ఎందుకంటే, కొత్తవి ఇచ్చేందుకు లేదు సరికదా, ఉన్న వాటకి కూడా కాలపరిమితి పూర్తయిన తర్వాత లైసెన్సులను పునరుద్ధరించ వద్దని ఆదేశించటంతో వస్తున్న కొద్ది పాటి ఆదాయాలు కూడా పడిపోనున్నాయి.

 

ఏటికి ఏడు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలో ప్రతీ సంవత్సరం కనీసం 1.5 లక్షల మంది దేశవ్యాప్తంగా మరణిస్తున్నట్లు సమాచారం.

 

అధునాతన పద్దతుల్లో రహదారులు నిర్మిస్తుండటం, వాహనాల వేగం కూడా పెరిగిపోవటంతో రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి.

supreme court take objection on roadside liquor sales

 

రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవటానికి డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపటంతో పాటు నిర్లక్ష్యం, తెల్లవారు జామున నిద్రలోకి జారుకోవటం లాంటివి ప్రధాన కారణాలు.

 

అందుకనే మద్యం సేవించినపుడు వాహనాలు నడపవద్దని, దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారు అర్ధరాత్రి తరువాత ఖచ్చితంగా కొద్ది గంటల పాటు డ్రైవర్లకు విశ్రాంతి నివ్వాలని న్యాయస్ధానం ఎప్పటి నుండో చెబుతున్నది.

 

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం అర్ధరాత్రి దాటిన తర్వాతనే జరుగుతున్నట్లు రవాణా శాఖలు అంచనా వేస్తున్నాయి. దానికి మద్యం సేవించి వాహనాలు నడపటం అదనం. ఈ విషయాలను గమనించింది కాబట్టే సుప్రింకోర్టు ప్రభుత్వాలకు గట్టిగా ఆదేశాలు జారీ చేసింది.

 

2014లో తెలుగు రాష్ట్రాల్లో 20078 ప్రమాదాలు జరగ్గా 6900 మంది మరణించారు. 21636 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా 2015లో జరిగిన 21252 ప్రమాదాల్లో 7110 మంది చనిపోగా 23 వేల మంది గాయపడ్డారు. అంటే ప్రతీ సంత్సరమూ రోడ్దు ప్రమాదాలు పెరుగుతున్నది వాస్తవం.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios