Asianet News TeluguAsianet News Telugu

సూప‌ర్ స్పీడ్ రైలు కింద ప‌డినా బ్ర‌తికిపోయాడు

  • రైలుకు ప్లాట్ పాం కి మధ్య ిరుక్కు పోయాడు
  • ప్రాణాలు కోల్పోవాల్సింది బ్రతికి బయట పడ్డాడు 
  • ప్రయాణికుల సాయంతో బ్రతికిపోయాడు
super speed rail crassed but still alive

బీజింగ్‌లోని డాంగ్జీమెన్‌ రైల్వే స్టేషన్‌లో ఒక విచిత్ర సంఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డ సూప‌ర్ స్పీడ్ రైళ్లు ప్ర‌యాణిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి ఫ్లాట్‌పామ్‌-రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అత‌ను స్టెప్స్ మీద నుండి కాకుండా ట్రాక్ మీదుగా దాట‌డానికి ప్ర‌య‌త్నించాడు. అప్పుడే రైలు రావ‌డంతో ఫ్లాట్ పామ్ కి రైలుకి మ‌ధ్య ఇర‌క్కుపోయాడు. అత‌డి కాళ్లు పూర్తిగా అందులో ఇరుక్కుపోయాయి. అతన్ని కాపాడేందుకు మొదట రైల్వే సిబ్బంది రంగంలోకి దిగింది. కానీ ఎంత  ప్రయత్నించినా బ‌య‌టికి తీసుకురావ‌డానికి కుదరలేదు.

స్టేష‌న్ లో ఉన్న ప్ర‌యాణికులు అంద‌రు క‌లిసి రైలునే ఒక ప‌క్క‌కు తోశారు. దీంతో ఇరుక్కుపోయిన వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

 రైలు వస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌ కిందకు దిగాడని, దీంతో రైల్వే డ్రైవర్ సడన్‌గా బ్రేక్‌ వేసినా అతను ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఉండే గ్యాప్‌లో చిక్కుకుపోయాడని తెలుస్తుంది. కానీ చివ‌రికి ప్ర‌యాణికుల సాయంతో బ్ర‌తికి బ‌య‌ట ప‌డ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios