Asianet News TeluguAsianet News Telugu

బిజెపి నేతలకు డ్రెస్ కోడ్ ఉండాలంటున్నారు

  • విదేశీ దుస్తులేసుకోరాదు
  • బిజెపిలో మద్యపానం నిషేధం ఉండరాదు

 

subramanya swamy suggest dress code for bjp leaders and ministers

బిజెపి నేతలకు డ్రెస్ కోడ్ ఉండాల్సిందే నంటున్నారు పార్టీ ఎంపి, మేధావి డాక్టర్ సుబ్రమణ్యస్వామి. ఈరోజు ట్వీట్ చేస్తూ  మోడ్రన్‌ దుస్తులు ధరించడాన్ని నిషేధించాలని కూడా ఆయన బిజెపి నాయకత్వానికి సలహా ఇచ్చారు. అపుడపుడు ట్వీట్ల ద్వారా, స్టేట్ మెంట్ల ద్వారా  సంచలనం సృష్టించడం సుబ్రమణ్యస్వామి కి అలవాటు.

 ‘ ఇపుడు మనం ధరిస్తున్న మోడ్రన్‌ దుస్తులు విదేశీ బానిస సంస్కృతి. భారతీయ జనతా పార్టీ మంత్రులు భారతీయ సంప్రదాయానికి వాతావరణానికి తగ్గ ట్టు దుస్తులు ధరించేలా పార్టీ నిబంధన విధించాలి,’ అన్నారు.

 

అంతేకాదు, మరొక అడుగు ముందుకేసి మద్యం కూడా నిషేధించాలని చెప్పారు.

‘రాజ్యాంగంలోని 41వ అధికరనణం మద్యపానాన్ని నిషేధిస్తుంది. తాగేవారి మీద చర్యలుండాలని నేనను. అయితే, మద్యపాన నిషేధానని పార్టీ క్రమశిక్షణలోభాగం చేయాలి,’అని ఆయన ట్వీట్ చేశారు.

మద్యపానం మీద ఇలా అన్నారు.

‘సాయంకాలం మందేసుకోవడం అనేది అపుడే అన్ని రకాల అవినీతి ఒప్పందాలు జరిగేది. అధికార కేంద్రాలలో తిరుగాడే బ్రోకర్లు చేసే పని.మధుమేహం వస్తుందన్నభయంకూడా వాళ్ల తాగుడు ను ఆపలేకపోతున్నది. కనీసం ఒక పావుగంట నిలకడగా నిలబడేపరిస్థితిలేకపోయినా తప్పేమి లేద నుకుంటారు.’ అని సుబ్రమణ్య స్వామి అన్నారు.

తర్వాత గుజరాత లోని  అహ్మదాబాద్ నగరం పేరు మార్చాలని కూడా స్వామి సూచించారు. ఈ నగరం పేరు పూర్వం కర్నావతి అని అంటూ ముఖ్యమంత్రి మోదీ నగరం పేరు మార్చాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఒక లేఖ రాశారు. ఇపుడాయనే ప్రధాని కాబట్టి ఆ పని పూర్తి చేయాలని కూడా అన్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios