లీటర్ పెట్రోల్ కు రు. 1 గోవు పన్ను

subramanya swamy proposes cow cess on petrol
Highlights

 భారత దేశంలో గోవుల సంరక్షణ ఇపుడు చాలా పెద్ద ఎత్తున అనేక రూపాలలో జరగుతూ ఉంది. దీన్నొక జాతీయ కార్యక్రమంగా చేపట్టాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి అంటున్నారు. దీనికయ్యే ఖర్చను పెట్రోలు మీద ఒక రుపాయ సెస్ విధించి వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.ప్రధాని మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

ఇపుడు దేశంలో కొనసాగుతున్న ‘గోసంరక్షణ’ సందడి చూస్తే గోవులకోసం త్వరలో పన్నును విధించినా ఆశ్చర్యం లేదు. గోవిపుడు దేశంలో చాలా ముఖ్యమయిన ప్రాణి. గోవు  ప్రాముఖ్యం  రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ఉంది.గోవు నుంచి వచ్చే పాలు, పేడ,మూత్రం వగైరాలు ఔషధ గుణాలను కనిపెడుతున్నారు. ఎవరో గోపతి అంటూ గోఉత్పత్తులతో వైద్యం కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో.  అందువల్ల గోవులను సంరక్షించుకోవలసిన అవసరం పెరుగుతుంది.

సరిగ్గా ఈ నేపథ్యంలో భారతీయజనతా పార్టీ ఎంపి డా. సుబ్రమణ్య స్వామి గోవుసెస్ నుప్రతిపాదించారు. గోసంరక్షణ కోసం గోశాలలు, మేత, వైద్యం వగైరాల ఖర్చులన్నింటిని భరించేందుకుందుకు దేశంలో ప్రజలు కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటర్ కు ఒక రుపాయ సెస్ విధించాలని ఆయన ప్రతిపాదించారు. బాంబే స్టాక్ ఎక్చేంజ్ లో విరాట్ హిందూ సంఘం(విహెచ్ ఎస్ ) భారతీయ గో సంక్షేమం మీద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేశారు. ఇలాంటి సెస్ వసూలు చేస్తే చాలా కేంద్ర శాఖల బడ్జెట్ అంత డబ్బు గోసంరక్షకు లభిస్తుందని స్వామి వాదించారు.

లీటర్ మీద ఒక రుపాయ సెస్ వేస్తే ఎంత డబ్బు వసూలవుతుందో చూద్దాం.

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిస్ (పిపిఎసి) డేటా ప్రకారం  2016లో 32   బిలియన్ లీటర్ల పెట్రోలు వినియోగం జరిగింది. తర్వాత డీజెల్, హై స్పీడ్ , లైట్ ఆయిల్ రకాల వినియోగం  మరొక 86 బిలియన్ లీటర్ల దాకా జరిగింది. సుబ్రమణ్య స్వామి ప్రతిపాదించినట్లు పెట్రోలు (డీజిల్ ఇతర పెట్రో ఉత్పత్తులన్ని)మీద ఒక రుపాయ పన్ను వేస్తే సంవత్సరానికి మూడువేల కోట్ల రుపాయల సెస్ వసూలవుతుంది. ఇది చాలా కేంద్ర శాఖ ల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు కేంద్ర సాంస్కృతిక శాఖ బడ్జెట్ కేవలం రు.2738 కోట్లు మాత్రమే.ఇలాగే పర్యావరణ అటవీ శాఖ వార్షిక బడ్జెట్ రు.2675 కోట్లు మాత్రమే. క్రీడా యువజన శాఖలకు కేటాయిస్తున్నది కూడా రు.1943 కోట్లు మాత్రమే.

ప్రభుత్వాలకు ఇది చాలా ఆకర్షణీయంగా కనిపించే ప్రతిపాదన. అందునా ప్రతిభారతీయుడు పవిత్రంగా భావించే అవుకోసం ఈ మాత్రం దానం చేయాలేరా? ఇది విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎవరూ పెద్ద గా వ్యతిరేకించకపోవచ్చు. ఇలాంటి విలువయిన ప్రతిపాదన చేసిన మొదటి రాజకీయమేధావి సుబ్రమణ్య స్వామియే.

ప్రస్తుతం  రాజస్థాన్లో  ఒక్క చోటే గో సంరక్షణ పన్ను అమలులో ఉంది. అక్కడ స్టాంప్ డ్యూటీలో 10 శాతం సర్ చార్జ్ గోవుల కోసం వసూలు చేస్తున్నారు. రాష్ట్రం లో ఉన్న అయిదారు లక్షల అవుల పోషణకు కనీసం రు. 200 కోట్ల నుంచి రు. 500 కోట్ల దాకా అవసరం మని అందుకే ఈ సర్ చార్జ్ విధించామని రాజస్థాన్ ప్రభుత్వం చెబుతూ ఉంది.

సుబ్రమణ్యస్వామి ప్రతిపాదనను విరాట్ హిందూస్థాన్ సంఘం సమర్థించింది.

loader