మన భూముల్లో యాపిల్ , స్ట్రాబేర్రి, దాల్చిన చెక్క ఎలా పండించాలో జనవరిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో చెబుతాను. రాబోయే రోజుల్లో  బాసుమతి ధాన్యం పండించే హాబ్ గా కృష్ణాజిల్లా మారబోతుంది. దీని కోసం తాను కృషిచేస్తాను - పాలేకర్

ఆంధ్రా బాస్మతి తొందర్లో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయ్. రాబోయే రోజుల్లో బాస్మతి ధాన్యం పండించే హాబ్ గా కృష్ణాజిల్లా మారబోతుంది. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పథకం వేస్తున్నది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో మొట్టమొదటి సారి ఆంధ్రలో ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలనుకుంటున్నారు. ఇదంతా ఇందులో భాగమే. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ను ఈ రోజు ఆయన నియమించారు.

 స్వదేశీ విత్తనాలు, స్వదేశీ పశు సంతతి వృద్ధికి ఆంధ్రాకు సాయం చేసేందుకు పాలేకర్ ముందుకు వచ్చారు. దీనికి స్పందిస్తూ అమరావతిలో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పాలేకర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం వంద ఎకరాలు, రూ. 100 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ,‘‘మన భూముల్లో యాపిల్ , స్ట్రాబేర్రి, దాల్చిన చెక్క ఎలా పండించాలో జనవరిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో చెబుతాను. రాబోయే రోజుల్లో బాసుమతి ధాన్యం పండించే హాబ్ గా కృష్ణాజిల్లా మారబోతుంది. దీని కోసం తాను కృషిచేస్తాను,’’ పాలేకర్ అన్నారు. 

ాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 260 క్లస్టర్లలో రెండు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అదనంగా రెండు లక్షల ఎకరాలలో పెట్టుబడి లేని ప్రకృతి సాగు చేయించాలని పాలేకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సీజన్లో రాష్ట్రంలో 50 వేల మంది రైతులతో 50 వేల ఎకరాలలో ప్రకృతి సాగు చేయించారు.