ప్రపంచ మహాసభలను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం సభలు నిర్వహించిన తీరు బాగుందన్న అల్లు అర్జున్ వైరల్ గా మారిన అల్లు అర్జున్ ట్వీట్
స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ‘‘ ప్రపంచ తెలుగు మహాసభలు’’ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై అల్లూ అర్జున్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన తీరు బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్యం, సంస్కృతిని చాటి చెప్పే దిశగా ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అద్భుతం అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. మహాసభలు విజయవంతం కావడం.. వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆనందం, గర్వం కలిగించాయని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ప్రభుత్వ చొరవను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపాడు.
ఎల్బీ స్టేడియం వేదికగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సభలకు కవుల, రచయితలతోపాటు పలువురు సినీ ప్రముఖులను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఇక ఈ విషయం పక్కనపెడితే.. అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’’ అనే చిత్ర షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు.
