విద్యార్థిని చావమోదిన ఫిజిక్స్ టీచర్

First Published 30, Dec 2017, 6:58 PM IST
student injured in Gowtham mdel school  teacher thrashing
Highlights

హైదరాబాద్  ఎఎస్ రావు నగర్ స్కూల్లో  ఘటన

మరొక విద్యార్థి టీచర్ దురుసు ప్రవర్తనకు గురయ్యాడు. గాయపడ్డారు.  హైదరాబాద్ ఎ ఎస్ రావు నగర్ గౌతమ్ మాడల్ స్కూల్ ఈ సంఘటన జరిగింది. అక్కడ  పదవతరగతి చదువుతున్న శశిధర్ అనే విద్యార్థి పై  సయ్యద్ బాజీ అనే ఫిజిక్స్ టీచర్ కు తెగ కోపమొచ్చింది.  కారణం, అదే స్కూల్ లో చదువుతున్న అతని చెల్లెలు అఖిల కు టిఫిన్ బాక్స్ అందజేయడానికి విద్యార్థి వెళ్లాడు.  అంతే,  తిరిగొచ్చిన శశిధర్ ను బాదేశాడు. దీనితో  విద్యార్థి కన్నుకు తీవ్ర గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం కుషాయిగుడా పోలీసులకు, సైబరాబాద్ కమీషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.  అధ్యాపకుడి పై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరింది.
పిల్లల కు ఏ మాత్రం రక్షణ కల్పించని పాఠశాల లను మూసివేయడంలో విద్యా శాఖ ఏ ప్రలోభాలకు ఆశపడి మిన్నకుండా వుంటున్నదని ప్రశ్నిస్తూ ఈ పాఠశాల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని బాలలహక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు  డిమాండ్ చేశారు.
 

loader