కడప నగర శివారులోని మాంట్ ఫోర్ట్ స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న చరణ్ రెడ్డి అనే విద్యార్థి టై తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంత చిన్న వయసులో తన టై తో తానే ఆత్మహత్య చేసుకోవడం  ఒకింత ఆశ్చర్యాన్ని ,అనుమానాన్ని కలిగిస్తోంది

పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా విద్యార్థి మృతదేహాన్ని రిమ్స్ కు తరలించడం యాజమాన్యం పై పలు అనుమానాలకు తావిస్తోంది.

తమకు సమాచారం ఇవ్వకుండా శవాన్ని ఎలా తరలిస్తారంటూ తల్లిదండ్రుల ఆందోళన చేసిన ఫలితం లేదు.

ఏమిటి ఈ వరుస విద్యార్థుల ఆత్మహత్యలు ఏంచేస్తుంది ప్రభుత్వం?

పర్యవేక్షణ లొ ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు.

వరుస ఘటనలు ఒక్క కడప జిల్లాలోనే జరగటానికి కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతో ఉంది.

విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలపడానికి వెళితే స్కూల్ మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవటం కొసమెరుపు.