ఇదో విచిత్ర వివాహం

ఇదో విచిత్ర వివాహం

ఆర్థిక సమస్యలు, కుటుంబ నేపథ్యం తదితర కారణాల వల్ల.. అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులను ఇప్పటి వరకు చాలా మందినే చూసుంటారు. కానీ ఇవే కారణాల వల్ల ఓ అబ్బాయి చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే.. అది కూడా తన కన్నా వయసులో పదేళ్లు పెద్దదైన యువతితో. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉప్పల్ హాల్ అనే గ్రామంలో జరిగింది ఈ విచిత్ర వివాహం.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఈ 13 ఏళ్ళ కుర్రాడి తండ్రి తాగుడుకు అలవాటు పడితే, తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. తను మరణిస్తే పిల్లలు ఏమవుతారోనన్న బెంగతో తల్లి పెద్ద కొడుకైన ఈ బాలుడికి పెళ్లి చేయాలని నిర్ణయించిందట. దూరపు బంధువుల్లో ఒక అమ్మాయిని చూసి (ఆమె వయస్సు దాదాపు 23 ఏళ్ళు) గతనెల 27 న పెళ్లి తంతు జరిపించింది. ఈ వింత పెళ్లిని చూసి వచ్చినవారంతా ఆశ్చర్య పోతూనే… వధూవరులను ఆశీర్వదించారట. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos