అక్కడ గాలిలోనే ‘‘వయాగ్రా’’ ఉంది

First Published 5, Apr 2018, 2:56 PM IST
Strange fumes in ‘Viagra’ village causing ’excitement’
Highlights
వయాగ్రా మింగాల్సిన పనిలేదు.. కేవలం గాలి పీల్చినా చాలు

సాధారణంగా ఏదైనా గ్రామంలో ఫ్యాక్టరీ కడుతున్నారనుకోండి.. ఆ గ్రామ ప్రజలంతా కలిసి.. నానా హంగామా చేసేస్తారు. ఫ్యాక్టరీ కట్టడానికి వీలు లేదని.. మూసివేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. కానీ.. ఓ గ్రామంలో మాత్రం అక్కడి ప్రజలు తెగ ఆనందపడిపోయారు. ఎందుకో తెలుసా..? అక్కడ కట్టింది ‘వయాగ్రా’ ట్యాబ్లెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ మరి. గత 20 ఏళ్లుగా ఆ గ్రామంలో వయాగ్రా ట్యాబ్లెట్స్ తయారౌతున్నాయి. వయాగ్రా ఎందుకు వాడతారో.. ప్రత్యేకంగా చెప్పనవరసం లేదనకుంట. పురుషుల్లో శృంగార  సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వాడతారు.  ఈ ట్యాబ్లెట్లను గత 20 ఏళ్లుగా ఐర్లాండ్ లోని రింగాస్కిడ్డీ అనే గ్రామంలో తయారు చేస్తున్నారు.

ఒక్కసారి కనుక ఆ గ్రామ ప్రజలను ‘ వయాగ్రా’ ఫ్యాక్టరీ గురించి కానీ, ట్యాబ్లెట్ల గురించి గానీ ప్రస్తావిస్తే.. తెగ సంబరిపోతారు. ఎందుకంటే.. తమ గ్రామంలో స్త్రీ, పురుషులకు ఎవ్వరికీ ఆ ట్యాబ్లెట్లు వేసుకునే అవసరమే రావడం లేదని చెబుతున్నారు. కేవలం ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగలు, వాసనతో తమలో ఉత్సాహం వచ్చేస్తోందని చెబుతున్నారు. కేవలం మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా ఆ వాసనకు బాగా కనెక్ట్ అయిపోతున్నాయని వారు చెప్పడం గమనార్హం. బ‌య‌ట తిరుగుతున్న స‌మ‌యాల్లోనూ, వాకింగ్ చేస్తున్న స‌మ‌యాల్లోనూ ఆ ఫ్యాక్ట‌రీ నుంచి వ‌చ్చే గాలి పీల్చ‌క‌త‌ప్ప‌డం లేద‌ని, దాంతో త‌మ శ‌ర‌రీంలో ఆ కోరికలు కలుగుతున్నాయని వారు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ గ్రామంపై సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. చాలా మంది పురుషులు.. ఈ గ్రామానికి హనీమూన్ కి వెళ్లాలని భావిస్తున్నామంటూ చెప్పడం విశేషం. ఇంకొందరైతే.. ఏకంగా అక్కడికే మకాం మారిస్తే ఎలా ఉంటుంది అని అంటున్నారు.

loader