Asianet News TeluguAsianet News Telugu

స్టార్ట్ అప్స్ సాఫ్ట్ వేర్ అడ్రసు మారుస్తున్నాయా?

  • ఈ స్టార్టప్స్ నిర్వహణ కాస్త రిస్క్ తో కూడుకున్నది అయినప్పటికీ..చాలా ఎక్సైటింగ్ ఉంటుంది.
  • తమ ప్రొఫెషనల్ కెరిర్  ఛాలెంజింగ్ ఉండాలనుకునేవారంతా ఈ రంగం వైపే అడుగేస్తున్నారు.
start ups are set to snatch the lime light from Silicon valley

ఒకప్పుడు.. యువతరం అందరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వైపే చూసే వారు. ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధిస్తే చాలు అని భావించేవారు. కానీ ప్రస్తుతం యువతలో మార్పు వస్తోంది. అదే స్టార్టప్స్.. వారికి వచ్చిన ఆలోచనకు కొంత పెట్టుబడి తోడైతే చాలు.. స్టార్టప్ కంపెనీ ప్రారంభమైనట్టే. ఈ స్టార్టప్స్ నిర్వహణ కాస్త రిస్క్ తో కూడుకున్నది అయినప్పటికీ..చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. తమ ప్రొఫెషనల్ కెరిర్  ఛాలెంజింగ్ ఉండాలనుకునేవారంతా ఈ రంగం వైపే అడుగేస్తున్నారు. మన దేశంలోనూ స్టార్టప్స్ కి ఆదరణ రోజు రోజుకీ పెరుగుతోంది. ఒక సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. మన దేశంలో 63శాతం మంది యువత ఈ-కామర్స్ స్టార్టప్స్ పై ఆసక్తి చూపుతుంటే.. మిగిలిన 37శాతం మంది నాన్ ఈ-కామర్స్ స్టార్టప్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. అంతెందుకు.. ఇప్పుడు ప్రముఖ వెబ్ సైట్లుగా పేరుగాంచిన ఫేస్ బుక్, అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లు కూడా ఒకప్పుడు స్టార్టప్ లుగా మొదలైనవే. ఇప్పుడు లక్షల టర్నోవర్ తో టాప్ లో నిలిచాయి.

start ups are set to snatch the lime light from Silicon valley

స్టార్టప్స్ క్రేజ్ ఎంతలా ఉందంటే.. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలపై పెద్ద కంపెనీల వాళ్ల చూపు పడుతోంది. చిన్న కంపెనీలకు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారితో కలిసి బిజినెస్ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్.  జుకర్ బర్గ్.. భారత సంతతికి చెందిన ఓ సైంటిస్ట్ తో కలిసి ఓ స్టార్టప్ ప్రారంభించారు. మెడిసిన్స్ కి సంబంధించిన స్టార్టప్ అది. దీని సృష్టికర్త అతుల్. ఈ స్టార్టప్ కంపెనీని సాన్ ఫ్రాన్సిస్కో లో  స్థాపించారు. ఎలాంటి జబ్బుకైనా మందులు అందించాలనే ఆలోచనతో దీనిని పెట్టారు. ఈ స్టార్టప్ కంపెనీకి జుకర్ బర్గ్ 10మిలియన్ డాలర్లు అందజేశారు. కంపెనీ పేరు.. ఇనిస్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ హెల్త్ సైన్సెస్. ఈ ఇనిస్టిట్యూట్ ని జుకర్ బర్గ్.. తన భార్యతో కలిసి ప్రారంభించారు. దీనిని చూస్తే అర్థమౌతుంది.. స్టార్టప్స్ కి క్రేజ్ ఎంతలా పెరిగిపోతోందో. ఈ నూతన సంవత్సరంలో స్టార్టప్స్ మరింత బలపడతాయని నిపుణులు కూడా చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios