20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
శబరిమల ఆలయంలో ఆదివారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడిన వారిని పంపా, కొట్టాయంలలోని ఆసుపత్రులకు తరలించి చికత్స అందిస్తున్నారు.
మాలికాపు రత్తమ్మ ఆలయం వద్ద తొక్కిసలాట జరిగినట్లు జిల్లా కలెక్టర్ గిరిజ తెలిపారు.
గాయాలపాలైన వారిలో అనంతపురం జిల్లా వాసులు ఉన్నట్లు సమాచారం అందింది.
