శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత. బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసిన కేరళ కోర్టు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న శ్రీశాంత్ కి ఊరట లభించింది. 2015 సంవత్సరంలో శ్రీశాంత్ ను నిర్దోషి అని తేలిన సంగతి తెలిసిందే. కానీ 2015 జూలై నుండి బీసీసీఐ మాత్రం అతడి పై ఉన్న నిషేధాన్ని తొలగించలేదు.
అయితే బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ సోమవారం కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో జట్టులో తిరిగి ఆడాలని పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. శ్రీశాంత్ పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని శ్రీశాంత్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. శ్రీశాంత్ పై ఉన్న నిషేధాన్ని తొలగించాలని బీసీసీఐ కి ఆదేశాలు జారీ చేసింది.
ఐపీఎల్ ఆరవ సీజన్‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. కానీ కోర్టు ఆయనను నిర్ధోషిగా ప్రకటించింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చింది.
ఈ తీర్పుతో శ్రీశాంత్ పై ఉన్న నిషేధం తొలిగిపోనుంది. అంటే శ్రీశాంత్ తిరిగి జట్టులోకి రావడానికి మార్గం క్లియర్ అవుతుంది.
జడ్జీ అంకుల్ పాత్ర ఉందా..!
ఇక 2013 లో క్రికెటర్ శ్రీశాంత్ ఐపీఎల్ కుంభకోణంలో ఆరోపణలు వచ్చినప్పుడు జడ్జ్ అంకుల్ గుడిని దర్శించుకున్నాడు, కోర్టులలో చార్జ్ చేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించారని సమాచారం. మరి ఆయనకు జడ్జి అంకుల్ న్యాయం చేశారనుకొవచ్చా? తాజా ఊదంతంతో జడ్జీ అంకుల్ గుడిలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మరింత బలపడింది.
