ఇండియా జట్టు పై శ్రీలంక జట్టు క్రికెట్ కోచ్ ప్రశంసల వర్షం. భారత జట్టును..రగ్బీలో న్యూజిలాండ్ టీంతో పోల్చాడు. ఇరు జట్ల మధ్య కేవలం జెర్సీ రంగుల్లోనే తేడా మిగతాదంతా ఓకటే. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు చాలా మారిందన్నారు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై శ్రీలంక కోచ్ నిక్ పోటాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ భారత జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత టీం ఇండియా రూపురేఖలు పూర్తిగా మార్చాడన్నాడు. అతడు నిర్దేశించిన ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయన్నాడు. భారత జట్టును.. రగ్బీలో అత్యంత గొప్పదైనా న్యూజిలాండ్ జట్టుతో పోల్చాడు. "రగ్బీలో న్యూజిలాండ్ జట్టైనా టీం ఆల్ బ్లాక్ కి కోహ్లీ సేనాకు ఎలాంటి తేడా లేద"న్నారు. ఇరు జట్ల మధ్య "కేవలం జెర్సీ రంగులోనే తేడా ఉంద"న్నారు. మిగతా అంత "సెమ్ టూ సెమ్" అని పోటాస్ కితాబిచ్చారు. కావాలంటే మీరోసారి న్యూజిలాండ్ రగ్బీ జట్టును చూడండి. భారత జట్టు ను చూసినట్లే ఉంటుందన్నారు. వారు బరిలోకి దిగితే ఎదుటి జట్టును నిర్ధాక్షిణ్యంగా ఓడిస్తారని తెలిపారు. రగ్బీలో న్యూజిలాండ్ జట్టు నైతిక విలువలు చాలా గొప్పవన్నారు. ఇప్పుడు అలాంటి లక్షణాలు కోహ్లీ నాయకత్వంలో భారత జట్టులో కనిపిస్తున్నాయని లంక కోచ్ కితాబిచ్చారు.


మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి...
