తనకు ఇష్టమైన కంచిపట్టు చీరలోనే శ్రీదేవిని అంతిమ యాత్ర‌కు ముస్తాబు

తనకు ఇష్టమైన కంచిపట్టు చీరలోనే శ్రీదేవిని అంతిమ యాత్ర‌కు ముస్తాబు చేశారు. అంత్య‌క్రియల కోసం శ్రీదేవి పార్థీవదేహన్ని అందంగా అలంక‌రించారు. నుదటన ఎర్రటి తిలకం దిద్దారు. మెజాంటా రంగు ఉన్న కంచి పట్టు చీరను కట్టారు. ఆమె మెడలో అందమైన ఆభరణాలు కూడా ఉన్నాయి. మల్లెపువ్వులు కూడా ఆమె పక్కనే పెట్టారు. శవపేటికను కూడా అందంగా అలంకరించారు.

అంతిమయాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు. పవన్‌హన్స్ శ్మశానవాటిక‌ వైపు అంతిమయాత్ర వెళ్తోంది. ప్రభుత్వ లాంఛనాలతో మహారాష్ట్ర స‌ర్కారు అంత్యక్రియల ప్రక్రియ నిర్వహిస్తున్నది.