స్పీకర్‌ మైక్‌ను విరిచేశారు. టేబుల్‌ విరగొట్టారు. అభద్రత భయంతో స్పీకర్‌ ధన్‌పాల్‌ సభ నుంచి వెళ్లిపోయారు

ముఖ్యమంత్రి పళని స్వామి ప్రభుత్వం మీద విశ్వాస పరీక్ష ప్రారంభంకాగానే విపరీతమయిన గందరగోళం ఏర్పడటంతో తమిళనాడు శాసనసభ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాయిదా పడింది.

గత 30 సంవత్సరాలలో తమిళనాడు అసెంబ్లీ ముందుకు వచ్చిన తొలి విశ్వాస తీర్మానం ఇది. చెన్నై రోడ్ల మీద, మెరినీ బీచ్ లో , పోయెస్ గార్డెన్, గోల్డన్ బే రిసార్ట్ తర్వాత ఎఐడిఎంకె లో అధికారం కోసం సాగుతున్న పెనుగులాట ఈ రోజు అసెంబ్లీ ముందకు వచ్చింది.

సభలో గొడవ, అలజడి, నినాదాలు చోటు చేసుకోవడంతో పాటు, ప్రతిపక్ష సభ్యులు దాడికి దిగడంతో స్పీకర్‌ ధనపాల్ , సభా కార్యక్రమం నిర్వహించ లేక సభనుంచి బైటికి వెళ్లిపోయారు. తర్వాత తమిళనాడు డీఎంకే సభ్యుడు కె.సెల్వం వెళ్లి ఈ కూర్చీలో కూర్చున్నారు.

కొంతమంది సభ్యులు అసెంబ్లీ కార్యదర్శి ఎఎంపి జమాలుద్దీన్‌ కుర్చీని విపక్ష సభ్యులు ధ్వంసం చేశారు.

సీక్రెట్‌ ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ పోడియం ముందు డీఎంకే, పన్నీర్‌ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతూ ఆందోళన చేయడంతో సభలో గొడవ మొదలయింది. స్పీకర్ ఈడిమాండ్ ను తిరస్కరించారు. దీనితో ఆగ్రహించిన పళని వ్యతిరేకం పోడియం దగ్గరికి దూసుకుపోయి ఘెరావ్ చేశారు. స్పీకర్‌ మైక్‌ను విరగొట్టారు. స్పీకర్‌ టేబుల్‌ను విరగొట్టారు. అభద్రత భయంతో స్పీకర్‌ ధన్‌పాల్‌ సభ నుంచి వెళ్లిపోయారు.


శాసనసభ ఆవరణ లోని మీడియా రూమ్‌లో ఆడియో సిస్టమ్‌ కనెక్షన్‌ను కట్‌ చేయడంతో సభలో ఏం జరుగుతున్నదో జర్నలిస్టులు తెలుసుకునే పరిస్థతిలేకుండాపోయింది. విశ్వాస తీర్మానం మీద వోటేసే ముందుకు శాసన సభ్యులు వారి వారి నియోజకవర్గాలలో పర్యటించేందుకు అనుమతించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు.