‘సాంబారు’ తో క్యాన్సర్ దూరం

First Published 27, Dec 2017, 5:51 PM IST
south indians favourite sambar can prevent colon cancer
Highlights
  • మన అందరికీ ఎంతో ప్రీతిప్రాయమైన సాంబారు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు

దక్షిణ భారతదేశానికి సాంబారుకి విడదీయరాని సంబంధం ఉంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో సాంబారు కచ్చితంగా ఉండాల్సిందే. అంతెందుకు ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వస్తే చేసే వంటకం కూడా సాంబారే. తయారు చేయడం సులభం అంతేకాకుండా రుచిగా కూడా ఉంటుంది. మన అందరికీ ఎంతో ప్రీతిప్రాయమైన సాంబారు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మణిపాల్ యూనివర్శిటీకి చెందిన పలువురు నిపుణులు దీనిపై పరిశోధనలు కూడా చేయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సాంబారులో వాడే.. సాంబారు పొడి కారణంగా పేగు సంబంధ క్యాన్సర్లు రాకుండా ఉంటాయట. కొన్ని రకాల  సుగంధ ద్రవ్యాలను( మిరియాలు, దనియాలు, కరివేపాకు,జీలకర్ర, పసుపు) ఉపయోగించి సాంబారు పొడి తయారు చేస్తారన్న విషయం మనకు తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆ పొడే.. పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటోంది. ఈ విషయం నిరూపితమైందని పరిశోధకులు చెబుతున్నారు.

ముంబయిలోని టాటా మెమోరియల్ ఇనిస్టిట్యూట్ లోని క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పలు రకాల క్యాన్సర్ లపై పరిశోధనలు చేసింది. వారి పరిశోధన ప్రకారం.. ఉత్తర భారతీయుల్లో పేగు క్యాన్సర్ ఎక్కువగా వస్తోందట. దక్షిణ భారతీయుల్లో రాకపోవడానికి సాంబారు కూడా ఒక కారణమని వారు చెబుతున్నారు. నార్త్ ఇండియన్స్ సాంబారు పెద్దగా తినరు. అందుకే వారిలో ఎక్కువ మంది ఈ రకం క్యాన్సర్ బారినపడుతున్నారని తేలింది.

సాంబారులో సాంబారుపొడితోపాటు.. టమాటాలు, పప్పు, దోసకాయ, బెండకాయ, మునగకాయలు లాంటి ఎన్నో రకాల కూరగాయాలను కూడా ఉపయోగిస్తారు. అవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

loader