జియో నుంచి మరో భారీ ఆఫర్

soon reliance jio enter into broadband services
Highlights

1000 జీబీ తో బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందివ్వడానికి ఏర్పాట్లు చేస్తోందట

ఫ్రీ కాల్స్, 4 జీ తో టెలికాం ఇండస్ట్రీని షేక్ చేసిన రిలయెన్స్ జియో ఇప్పుడు మరో  భారీ ఆఫర్ తో ముందుకు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 

అయితే ఈ సారి మొబైల్ ఆఫర్ తో కాకుండా ఇంటర్నెట్ సేవలపైనే ఈ ఆఫర్ ప్రకటించనునట్లు సమాచారం.

 

బ్రాడ్ బ్యాండ్ కంపెనీలకు దడ పుట్టేంచేలా ఈ ఆఫర్ ఉండబోతోందట. ఏవరూ ఊహించని విధంగా 1000 జీబీ తో బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందివ్వడానికి ఏర్పాట్లు చేస్తోందట.

 

ఇందులో భాగంగా ఇప్పటికే పుణె, ముంబైలో ప్రయోగాత్మకంగా ఈ సేవలను పరిశీలించినట్లు తెలిసింది. ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు ఈ బ్రాండ్ బ్యాండ్ సేవలను ఇప్పటికే వినియోగిస్తున్నారు.

 

వారు ఇంటర్నెట్ లో జియో స్పీడ్ పై చేస్తున్న పోస్టుంగ్ లు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై జియో నుంచి ఇప్పటివరకు అధికారకంగా ఏలాంటి ప్రకటన వెలువడలేదు.

 

loader