త్వరలో ఎగిరే కార్లు

త్వరలో ఎగిరే కార్లు

ప్రముఖ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కంపెనీ.. టెస్లా గురించి వినే ఉంటారు. అలాంటి కంపెనీలో ఉద్యోగం రావడమే చాలా కష్టం. అలాంటిది అందులో వచ్చిన ఉద్యోగాన్ని ఎవరైనా వదులుకుంటారా? కానీ ఓ యువకుడు తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకునేందుకు అదే చేశాడు. ఇంతకీ ఏమిటతని డ్రీమ్..? అందుకోసం ఆయన ఏమి చేశాడో ఇప్పుడు చూద్దాం..

నమన్ చోప్రా. ప్రస్తుతం రెక్సానామో ఎలక్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ ఇప్పుడు. ఒకప్పుడు టెస్లాలో ఒక సాధారణ ఉద్యోగి. అందరిలాగా ఉద్యోగం చేసి నెల గడవగానే జీతం అందుకోవడం నమన్ కి నచ్చలేదు. అందుకే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం తనలాంటి మరో 15మంది ఇంజినీర్లను ఎంచుకున్నాడు. వారితో కలిసి రెక్సానామో కంపెనీ స్థాపించాడు. వారి టీమ్ చిన్నదే కావచ్చు.. కానీ టాలెంట్ విషయంలో మాత్రం మేము తక్కువ కాదని చెబుతున్నాడు నమన్. వీరంతా కలసి ఓ బైక్ ని తయారు చేశారు. ఇండియాలో అత్యంత వేగంగా ప్రయాణించే ఎలక్ట్రానిక్ బైక్     అది. త్వరలోనే దీనిని భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు.

ఈ బైక్ ప్రత్యేకత ఏమిటో తెలుసా.. కేవలం అరగంటలో బైక్ ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. అంతేకాదు.. గంటకు 170కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ బైక్ నుంచి ఎలాంటి సౌండ్స్ కూడా రావు. దీని ఖరీదు రూ.8లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మీకు కనుక ఈ బైక్ కొనగలిగే సామర్థ్యం ఉంటే.. మీరు కోరుకునే ప్రతీదీ ఇందులో లభిస్తుందని నమన్ చెబుతున్నారు. ఇలాంటి ఫీచర్లతోనే తక్కవ ఖరీదులో బైక్ తయారు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు నమన్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం పాతకాలంనాటి డీజిల్ వాహనాలను బ్యాన్ చేస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు పెరగే అవకాశం ఉందని కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు అందరూ మొగ్గు చూపినట్లు ఆయన చెప్పారు. అయితే.. పాత మోడల్ వాహనాలను రీమోడలింగ్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చవచ్చిని ఆయన తెలిపారు. కేవలం రూ.3.5నుంచి 4లక్షల్లో ఆ కార్లను రీమోడలింగ్ చేస్తామని నమన్ చెప్పారు. అంతేకాదు.. ఫ్లైయింగ్ కారును కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మోడల్ ని కూడా తయారు చేశామన్నారు.

 

source : let me breath

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos