కన్నతండ్రిని బండరాయితో కొట్టిచంపిన కొడుకు

First Published 6, Apr 2018, 2:14 PM IST
Sons kill father over financial issue
Highlights
ఇతరుల దగ్గర ఇప్పించిన అప్పు తీర్చమన్నందుకు

కొడుకు ఆర్థిక ఇబ్బందులు చూడలేక ఆ తండ్రి వేరేవారి దగ్గర అప్పుతెచ్చి మరీ డబ్బులిచ్చాడు. అతడు ఆర్థికంగా స్థిరపడడానికి ఆస్తిని కూడా పంచిచ్చాడు. కానీ తాను మద్యవర్తిగా ఉండి ఇప్పించిన డబ్బులు చెల్లించమనొ  అడిగినందుకే ఓ కొడుకు తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వర్థన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన మంద అయిలయ్య(60)కి ముగ్గురు కొడుకులు. వీరిలో చిన్నవాడైన దేవేందర్‌ కి ఆర్థిక అవసరాలు ఉండటంతో ఎక్కడైనా అప్పు ఇప్పించాలని తండ్రిని ప్రాదేయపడ్డాడు. దీంతో ఓ తెలిసిన ఓ వ్యక్తి వద్ద తండ్రి దేవేందర్ కు రూ. 50 వేలు అప్పు ఇప్పించాడు. అయితే ఈ అప్పు వడ్డీతో కలిసి తడిసిమోపెడయ్యింది. దేవెందర్ వడ్డీ కూడా చెల్లించకపోడంతో సదరు అప్పు ఇచ్చిన వ్యక్తి వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాలని అయిలయ్య కు చెప్పాడు. దీంతో అతడు కొడుకుకు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో తండ్రీ కొడుకుల మద్య ఘర్షణ చేలరేగింది. ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మద్య మాటామాటా పెరిగింది. దీంతో దేవేందర్ కోపంతో ఓ బండరాయిని తీసుకుని తండ్రి తలపై కొట్టడంతో అతడు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దేవేందర్‌ అక్కడినుండి పరాడయ్యాడు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న దేవేందర్ కోసం గాలిస్తున్నారు.

loader