ఇలాంటి డ్రస్ వేసుకోవడానికి సిగ్గుగా అనిపించలేదా...?

First Published 13, Apr 2018, 12:31 PM IST
Sonakshi Sinha gets trolled for wearing red see-through dress, have you seen it?
Highlights
సోనాక్షి పై విరుచుకుపడ్డ నెటిజన్లు

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆమె వేసుకున్న దుస్తులపై మండిపడుతున్నారు. బాలీవుడ్ నటుల దుస్తుల విషయంలో నెటిజన్లు మండి పడటం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ లువారి దుస్తుల విషయంలో నెటిజన్ల చేత చివాట్లు తిన్నవారే. కాగా ఇప్పుడు ఆ జాబితాలో సోనాక్షి కూడా చేరింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. సోనాక్షి.. ఇటీవల రెడ్ కలర్ అవుట్ ఫిట్ డ్రస్ వేసుకుంది. ఆ డ్రస్ వేసుకన్న సమయంలో దిగిన ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. అంతేకాదు.. ఆ డ్రస్ లో తాను చాలా అందంగా ఉన్నానని.. స్టన్నింగ్ అవుట్ ఫిట్ అని పొగడ్తలు వచ్చాయంటూ క్యాప్షన్ కూడా జత చేసింది. అంతే.. ఆమె కి పోస్టుపై కామెంట్ల వర్షం కురిసింది. చాలా తక్కువ మంది ఆ పోస్టుకి పాజిటివ్ గా రెస్పాండ్ కాగా.. మిగితా వారంతా సోనాక్షి పై మండిపడ్డారు. కొందరైతే డ్రస్సు పరమ చెత్తగా ఉందని కామెంట్ పెట్టారు.

 

ఒక వ్యక్తి మాత్రం.. ఇలాంటి డ్రస్సు వేసుకోవడానికి మీకు  సిగ్గుగా అనిపించలేదా అంటూ కామెంట్ చేశాడు.ఇంకెప్పుడూ ఇలంటి డ్రస్ వేసుకోవద్దంటూ సలహా కూడా ఇచ్చారు. నెటిజన్లు అంతలా మండిపడటానికి కారణం ఉంది. పేరుకే ఒళ్లంతా కప్పుకున్నట్లు ఉన్నా ఆ డ్రస్ లో నుంచి బాడీ పార్ట్స్ మొత్తం కనిపిస్తున్నాయి. అందుకే అభిమానులు అంతలా రియాక్ట్ అయ్యారు.

loader