తల్లి నోట్లో పురుగుల మందు పోసిన కొడుకు (వీడియో)

తల్లి నోట్లో పురుగుల మందు పోసిన కొడుకు (వీడియో)

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో దారుణం జరిగింది. భూ తగాదాల విషయంలో తీవ్ర మనస్థాపానికి గురైన భాదితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  బాధితుడు తన  తల్లి నోట్లో విషం పోసి తాను కూడా తాగడానికి ప్రయత్నించాడు. అక్కడున్నవారు అతడిని అడ్డుకున్నారు.

ఈ ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గంలోని పెదగుండవెళ్లి గ్రామానికి చెందిన అంజమ్మ కొద్ది రోజుల క్రితం ఆర్థిక అవసరాలకోసం తన కుటుంబానికి చెందిన ఎకరం భూమిని అమ్మేసింది. అయితే తిరిగి అదే భూమిని కొనుగోలు చేయాలని భావించింది. ఇందుకోసం ప్రయత్నాలు చేయడం, ఆ భూమి కొన్న వారితో గొడవ జరగడం జరిగింది. దీంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో మరో సారి ఇరు వర్గాల మద్య వాగ్వివాదం జరిగింది. తమకి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని అంజమ్మ, ఆమె కొడుకు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోను తమతో పాటు తెచ్చుకున్న పురుగుల మందును తల్లి నోట్లో పోశాడు. ఆ తర్వాత తాను కూడా తాగడానికి ప్రయత్నించగా     అక్కడే ఉన్నటువంటి  గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గ్రామస్తులు కలిసి అంజమ్మను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ఈ ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos