విశాఖ పట్టణాన్ని కుదిపేస్తున్న భూముల స్వాహా విషయంమీద వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భారతీయ జనతా పార్టీల ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేఖ రాశారు.

 

విశాఖపట్నంలో ఇటీవల వెలుగుచూసిన భూ కుంభకోణంలో‘ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యలతో పాటు ఇతర నేతల’ హస్తం ఉందని విశాఖకే చెందిన మరొక మంత్రి అయ్యన్న పాత్ర వెల్లడించి కలకలం సష్టించిన సంగతి తెలిసిందే.  అలాగే ఇసుక మాఫియా, మద్యం అమ్మకాల్లో అక్రమాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయిన విషయం గుర్తు చేస్తూ వీటన్నింటిని మీద  అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన  ఆ లేఖలో కోరారు.

 

విశాఖ భూముల స్వాహా మీద బిజెపి కినుక వహించింది. ఈ విషయం మీద రచ్చ చేసేందుకు పార్టీ సిద్దమయినట్లుంది.  ఎందుకంటే,  ఈ కుంభకోణం మీద ఇప్పటికే బిజెపి శాసన సభ్యుడు విష్ణు కుమార్ రాజు కేంద్రానికి తెలియ చేశారు. కుంభకోణం మీద అనేక ఆసక్తికరమయిన విషయాలను ఆయన వెల్లడించారు. ఇపుడు బిజెపిలో  ముఖమంత్రి వ్యతిరేక కూటమికి చెందిన సోము వీర్రాజు అఖిల పక్షం కోరుతున్నారు.

 

ముఖ్యమంత్రి స్వయంగా స్పందిస్తారా లేక బిజెపి అధిష్టానానికి చెప్పి వీర్రాజు నోరు మూయిస్తారా చూడాలి.