వరస విజయాలతో దూసుకుపోతున్న హీరో నేచురల్ స్టార్ నాని.  ఆయన, ఫిదా ఫేం సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంసీఏ’( మిడిల్ క్లాస్ అబ్బాయి) ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం ( డిసెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

ఈ సినిమా ఎందుకు చూడాలి అనే సందేహం కొందరికి రావచ్చు. అయితే.. ఈ సినిమాని ప్రజలు చూడటానికి చాలా కారణాలే ఉన్నాయంటోంది చిత్ర బృందం. ముఖ్యంగా నాని కోసమైనా ఈ సినిమా చూడొచ్చు. నాని ని చూస్తుంటే అందరికీ పక్కింటి అబ్బాయిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంత నేచురల్ గా ఉంటుంది అతని నటన. ఇక సినిమా విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ కుటుంబాల నేపథ్యంతో తెరకెక్కించారు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా వెంటనే కనెక్ట్ అవుతుంది. ప్రతి సన్నివేశం చాలా సహజంగా తెరకెక్కించారు.

 ఇక ఈ సినిమాకి మరో ఆకర్షణ సాయి పల్లవి. చాలా సహజంగా నటిస్తూ.. తన నటన డ్యాన్స్ లతో అందరినీ ఇప్పటికే ఫిదా చేసింది. ఈ సినిమా లో కూడా అంతే అందంగా కనిపిస్తూ.. అలరిస్తుందనడానికి  ఇటీవల విడుదలైన ట్రైలర్ నిదర్శనం. ఇక వీళ్ల ఇద్దరి కాంబినేషన్ అంటే కచ్చితంగా అదిరిపోతుంది.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.

 సినిమాలో కామెడీ సీన్లు.. చాలానే ఉన్నాయి. సినిమా చూసేది వినోదం కోసం. అలాంటి వినోదం ఈ సినిమాలో బోలెడంత ఉందని టాక్. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సీన్లు ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. అంతేకాకుండా యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అదేవిధంగా సెంటిమెంట్, రిలేషన్స్.. ఇలా చాలానే ఉన్నాయి. మిడిల్ క్లాస్ వ్యక్తి వాల్యూ తెలియజేస్తుంది. ఇవి చాలదా ‘ఎంసీఏ’ మూవీ చూడటానికి.