అద్బుత బౌలింగ్ తో ఆకట్టుకున్న పాక్ బౌలర్. కరేబీయన్ లీగ్ లో నాలుగు ఓవర్లరో ఐదు వికెట్లు.

పాకిస్తాన్ బౌల‌ర్ రికార్డు సృష్టించాడు. సోహైల్‌ త‌న్వీర్ ఎంత ప్ర‌మాద‌క‌ర బౌల‌రో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇప్ప‌టికే చాలా రికార్డులు త‌న ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్‌లో తన్వీర్‌ సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున ఆడిన తన్వీర్‌ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

ఇప్పుడు మ‌రో రికార్డ్ సృష్టించాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో అద్భుతం చేశాడు. గయానా అమెజాన్‌ వారియర్స్‌ తరపున ఆడుతున్న తన్వీర్‌ తన పదునైన బౌలింగ్‌తో జట్టుకు ఒంటిచెత్తో విజయాన్ని అందించాడు. మంగళవారం బార్బడోస్‌ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. సొహైల్ 4 ఓవర్లలో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన నాలుగు ఓవర్లలో ఒక వైడు బాల్‌ వేశాడు. ఒక ఓవర్‌లో పరుగులేమి ఇవ్వలేదు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన బార్బడోస్‌ టీమ్‌ తన్వీర్‌ ధాటికి 13.4 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 99 పరుగుల తేడాతో బార్బడోస్‌ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 5 వికెట్లు తీసి వారియర్స్‌కు విజయాన్ని అందించిన తన్వీర్‌కు 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌' దక్కింది.

మరిన్ని నూతన వార్తాల కోసం కింద క్లిక్ చేయండి