యోగా గురు బాబా రామ్ దేవ్ ను సోషల్ మీడియా చంపేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ సోషల్ మీడియా ఆయన ఉసురు తీసింది.

 

పూణే ముంబై హైవే లో రాందేవ్ బాబా కార్ యాక్సిడెంట్ అయిందని బాబా అక్కడికక్కడే చనిపోయారని ఓ ఫేక్ ఫొటో వాట్సాప్, ఫేస్ బుక్ లలో ఈ రోజు ఉదయం నుంచి తెగ సర్క్యూలేట్ అవుతోంది.

 

తీరా ఆరా తీస్తే అదంతా ఫేక్ న్యూస్ అని తెలింది. యాక్సిండెంట్ అయినదిగా చెబుతున్న వాహనం ఎంపీకి సంబంధించనట్లుగా ఉంది. అందులోంచి రాం దేవ్ ను ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ రోజు వైరల్ గా మారిన ఫొటోనే ఏడాది కిందట ఇలానే సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయింది.అసలు విషయం తెలియక కొందరు నెటిజన్లు బాబా నిజంగా చనిపోయారని ఆ ఫేక్ ఫొటోనే షేర్ చేస్తున్నారు.

 

అయితే ఆ ఫేక్ ఫొటోలో ఉన్న కార్ యాక్సిండెంట్ కు బాబాకు ఏలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం బాబా రాందేవ్ హరిద్వార్ లో క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా బాబా కు యాక్సిండెంట్ జరగలేదని ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి.