వరంగల్ యువకుడిపై సోషల్ మీడియా దెబ్బ

social media effect on waranga boy
Highlights

సీఎం కుటుంబంపై అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు

సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ కుటుంబంపై అనుచిన పోస్టింగ్ లు పెడ్డుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇంతకు ముందే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ఫేస్ బుక్ గ్రూప్ ను నడుపుతూ, అందులో ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆ గ్రూప్ అడ్మిన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాగే మరో యువకుడిని సీఎం కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ పెట్టినందుకు వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బయ్యారం మండల కేంద్రానికి చెందిన రాథోడ్‌ భాయి అనే వ్యక్తి కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఫొటోలను మార్పింగ్ దాని కింద ‘స్టూవర్టుపురం దొంగల ముఠా’అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా దీన్ని పలు గ్రూపుల్లో పోస్టు చేశాడు. దీన్ని గమనించిన తెరాస నాయకుడు జరుపుల శ్రీను బయ్యారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రాథోడ్‌ భాయిపై ఐపీసీ 153ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇలా సామాజిక మాధ్యమాఫోల్లో అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై సైబర్‌ క్రైమ్‌ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. కాబట్టి ఇతరులపై కామెంట్స్ కానీ, ఇతరుల ఫోటోలు కాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేపుడు ఆలోచించాలని, లేదంటే ఇలా అభ్యంతరకరంగా ఉంటే సైబర్ క్రైమ్ కింద నేరంగా పరిగణిస్తామని తెలిపారు.


 

 

loader